YS Sharmila: సిగ్గు పడండి కేసీఆర్ గారు: షర్మిల

Be shameful KCR says Sharmila
  • మీ పాలనలో మహిళకు దక్కుతున్న సత్కారాలకు సిగ్గుపడండి
  • అన్నం బాగోలేదంటే మీ ఖాకీలు లాఠీలతో కొడతారా?
  • భూములు లాక్కోవద్దన్న గిరిజనులను జైలుకు పంపించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తమరి పాలనలో మహిళకు దక్కుతున్న సత్కారాలకు సిగ్గుపడండి కేసీఆర్ గారు అని మండిపడ్డారు. కేసీఆర్ దొరగారి ఖాకీలు చంటి పిల్లల తల్లులని కూడా చూడకుండా, వారితో అడ్డగోలు పని చేయించి, పాచిపోయిన అన్నం పెడతారా? అని ప్రశ్నించారు. అన్నం బాగోలేదని అంటే లాఠీలతో కొడతారా? అని దుయ్యబట్టారు. కాళ్లు పడితేనే అన్నం పెడతారా? అని మండిపడ్డారు. 'జైల్లో నరకం చూశాం' అంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనం స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు.

పోడు చేసుకునే భూములను లాక్కోవద్దు అంటే గిరిజన మహిళా రైతులపై అక్రమ కేసులు పెట్టారని షర్మిల మండిపడ్డారు. ఆపై వారిని జైలుకు కూడా పంపి నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అహంకార పాలనపై మహిళా సైన్యం తిరగబడుతుందని అన్నారు. ఈ గిరిజన గళం రేపు మిమ్ములను తరిమి కొడుతుందని హెచ్చరించారు.
YS Sharmila
YSRTP
KCR
TRS
Women
Police

More Telugu News