భారత్ లో మరోసారి 40 వేలను దాటిన కరోనా కొత్త కేసులు

12-08-2021 Thu 10:28
  • 24 గంటల్లో 41,195 పాజిటివ్ కేసులు
  • 490 మంది బాధితుల మృతి
  • ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులు
India reports 41195 new cases in one day
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మరోసారి 40 వేల మార్క్ ను దాటింది. గత 24 గంటల్లో 41,195 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 39,069 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 490 మంది కరోనా బాధితులు మృతి చెందారు.

కొత్త కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,20,77,706 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,12,60,050 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,29,669 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 97.45 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.94 శాతంగా ఉందని వెల్లడించింది. యాక్టివ్ కేసులు 1.94 శాతంగా ఉన్నాయని పేర్కొంది.