సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

12-08-2021 Thu 07:43
  • కాజల్ ఇంట్లో 'తీజ్' పండుగ సందడి 
  • బాలయ్య 'అఖండ' షూటింగ్ పూర్తి
  • అరకులోయలో రాజ'శేఖర్' షూటింగ్    
Kajal celebrates Tej festival
*  కథానాయిక కాజల్ అగర్వాల్ ఇంట్లో 'తీజ్' పండుగను జరుపుకున్నారు. రుతుపవనాలకు స్వాగతం పలుకుతూ ఉత్తరాది మహిళలు జరుపుకునే పండుగే తీజ్. తనకు పెళ్లయిన తర్వాత వచ్చిన పండుగ కాబట్టి, 'ఇది నాకు తొలి తీజ్' అంటూ కాజల్ పేర్కొంది. అందరికీ తీజ్ శుభాకాంక్షలు కూడా చెప్పింది.
*  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న 'అఖండ' సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రం స్టంట్ కో-ఆర్డినేటర్ 'స్టన్' శివ పేర్కొంటూ, చిత్రం ఇంటర్వల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ దృశ్యాలను ఎనభై రోజుల పాటు చిత్రీకరించామని పేర్కొన్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరలో పూర్తిచేసి, వియదశమికి చిత్రాన్ని విడుదల చేస్తారు.  
*  డా.రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న 'శేఖర్' చిత్రం షూటింగ్ తాజా షెడ్యూలు అరకులోయలో నిన్న మొదలైంది. ఈ షెడ్యూలుతో సుమారు 75 శాతం పూర్తవుతుందని చిత్ర దర్శకుడు లలిత్ తెలిపారు. అరకులోయలో ఇరవై రోజుల పాటు ఈ షెడ్యూలు జరుగుతుంది.