రాకెట్ క్రయోజెనిక్ దశలో సమస్య.. జీఎస్ఎల్‌వీ - ఎఫ్10 ప్రయోగం విఫలం

12-08-2021 Thu 06:55
  • వేకువజామున 5.43 గంటలకు నింగిలోకి
  • ఈవోఎస్-03ని మోసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ
  • ప్రయోగం విఫలమైందన్న ఇస్రో చైర్మన్
ISRO GSLV F10 launch failed
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ తెల్లవారుజామున చేపట్టిన జీఎస్ఎల్‌వీ-ఎఫ్10 ప్రయోగం విఫలమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ తెల్లవారుజామున 5.43 గంటలకు ప్రయోగం చేపట్టారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-03)ని మోసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ తొలుత బాగానే నింగిలోకి దూసుకెళ్లింది.

అయితే, ఆ తర్వాత క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అది నిర్దేశిత మార్గంలో కాకుండా మరోమార్గంలో వెళ్లిందని, ఫలితంగా ప్రయోగం విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.