Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

Strong earthquake of magnitude 7  strikes Philippines no tsunami threat
  • పొందగిటాన్‌కు 63 కిలోమీటర్ల దూరంలో భూకంపం
  • భూమికి 65.6 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
  • నష్టాన్ని అంచనా వేసే పనిలో ఫివోల్క్స్
ఈ తెల్లవారుజామున ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.1గా నమోదైంది. పొందగిటాన్‌కు తూర్పున 63 కిలోమీటర్ల దూరంలో 65.6 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. నష్టానికి సంభవించి ప్రాథమికంగా ఎలాంటి సమాచారం లేదు.

అయితే, ఫిలిప్పీన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వోల్కోనాలజీ అండ్ సిస్మోలజీ (ఫివోల్క్స్) నష్టాన్ని అంచనా వేసే పనిలో పడినట్టు ‘సీఎన్ఎన్’ తెలిపింది. దేశానికి సునామీ ముప్పు పొంచి ఉందని ఫివోల్క్స్ పేర్కొనగా, అలాంటిదేమీ లేదని యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ అండ్ హవాయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.
Philippines
Earthquake
Tsunami

More Telugu News