ఐశ్వర్యం కంటే జగన్ గుండెల్లో స్థానమే గొప్పది: పేర్ని నాని

11-08-2021 Wed 19:19
  • నమ్ముకున్న వారిని జగన్ వదిలిపెట్టరు
  • అందరూ బాగుండాలనేది జగన్ తత్వం
  • మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదు
Place in Jagans heart is great for me says Perni Nani
ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి పేర్ని నాని మరోసారి తన స్వామి భక్తిని చాటుకున్నారు. ఐశ్వర్యం కంటే జగన్ గారి గుండెల్లో స్థానమే తనకు చాలా గొప్పదని ఆయన అన్నారు. తనను నమ్ముకున్న వారిని జగన్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరని చెప్పారు. అందరూ బాగుండాలనేది ఆయన తత్వమని అన్నారు. తాను మంత్రినవుతానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. జగన్ సంక్షేమ పాలనలో తాను కూడా భాగస్వామిని కావడం గర్వంగా ఉందని అన్నారు.