Ashok Gajapathi Raju: మాన్సాస్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు!

AP High Court gives green signal to Ashok Gajapathi Raju to continue as Mansas charman
  • మాన్సాస్ చైర్మన్ గా అశోక్ కు గ్రీన్ సిగ్నల్
  • పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ తో కూడిన బెంచ్
  • సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సమర్థన
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా టీడీపీ నేత అశోక్ గజపతిరాజును కొనసాగించాలని హైకోర్టు తీర్పును వెలువరించింది. అశోక్ గజపతిరాజును ట్రస్ట్ ఛైర్మన్ గా నియమిస్తూ గతంలోనే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సంచయిత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్లను హైకోర్టు చీఫ్ జస్టిస్ తో కూడిన బెంచ్ విచారించింది. మాన్సాస్ ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజే కొనసాగుతారని హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది.
Ashok Gajapathi Raju
Telugudesam
MANSAS
AP High Court

More Telugu News