తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

11-08-2021 Wed 16:01
  • ఒకానొక సమయంలో 592 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • చివర్లో మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు
  • 2 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Markets ends in flat mode
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈనాటి ట్రేడింగ్ ను లాభాల్లో ప్రారంభించిన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 592 పాయింట్ల మేర నష్టపోయింది. అయితే, చివర్లో హిండాల్కో, వేదాంత, టాటా స్టీల్ వంటి మెటల్ స్టాకులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో... మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి.

దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 54,525కి పడిపోగా... నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 16,282 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.86%), ఎన్టీపీసీ (2.36%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.06%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.33%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.14%).
 
టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.90%), సన్ ఫార్మా (-1.78%), బజాజ్ ఆటో (-1.64%), నెస్లే ఇండియా (-0.96%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.93%).