Ravi Shastri: టీమిండియా చీఫ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పిన రవిశాస్త్రి.. కీలక బాధ్యతలను చేపట్టనున్న ద్రావిడ్?

  • టీ20 ప్రపంచకప్ తర్వాత వైదొలగనున్న రవిశాస్త్రి
  • ఇప్పటికే బీసీసీఐకి తన అభిప్రాయాన్ని చెప్పినట్టు సమాచారం
  • తదుపరి చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ అంటూ ప్రచారం
Ravi Shastri to resign to chief coach post

టీమిండియా కొత్త చీఫ్ కోచ్ గా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ వస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి వెళ్లిపోనున్నాడని విశ్వసనీయంగా తెలుస్తోంది. చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్టు ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి రవిశాస్త్రి చెప్పేశారని సమాచారం.

టెక్నికల్ గా ఇక్కడ ఒక కీలకమైన అంశం కూడా ఉంది. టీమిండియా చీఫ్ కోచ్ పదవిలో ఉండేవారి గరిష్ట వయస్సు 60 ఏళ్లు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం రవిశాస్త్రి వయసు 59 ఏళ్లు దాటాయి. ఈ కారణంగా కూడా ఆయన ఇకపై కొనసాగే అవకాశం లేదు. టీ20 ప్రపంచకప్ ముగిసే సమయానికి రవిశాస్త్రి వయసు 60 ఏళ్లు ఉంటుంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత చీఫ్ కోచ్, సహాయ కోచ్ ల కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించనుంది.

మరోవైపు, అండర్-19, భారత్-ఏ టీమ్ కోచ్ గా ద్రావిడ్ విజయవంతమయ్యారు. నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ గా రిజర్వ్ బెంచ్ ను పటిష్ఠం చేసిన ఘనత కూడా ఆయన సొంతం. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వంటి వారికి ద్రావిడ్ అత్యంత సన్నిహితుడు. వీరందరూ కలిసి టీమిండియాకు ఎన్నో ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. ఈ రకంగా చూసినా ద్రావిడ్ చీఫ్ కోచ్ బాధ్యతలను చేపట్టేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.

More Telugu News