వినూత్న కార్యక్రమంతో ‘హీరో’ గిన్నిస్​ రికార్డ్​

11-08-2021 Wed 14:40
  • ప్రపంచంలోనే అతిపెద్ద లోగో
  • 1,845 స్ప్లెండర్ బైకులతో సృష్టి
  • 90 రోజుల పాటు ప్రణాళికలు
Hero Motocorp Creates Guinness World Record
ఒకప్పుడు హోండా కంపెనీతో కలిసి హీరో సంస్థ బైకులను ఉత్పత్తి చేసింది. అయితే, హోండా మధ్యలో విడిపోయింది. అలా విడిపోయి దశాబ్దం గడిచింది. ఈ సందర్భంగా సంస్థ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద లోగోను సృష్టించి గిన్నిస్ రికార్డును నెలకొల్పింది. అందుకు ‘స్ప్లెండర్ ప్లస్’ బైకులను వాడుకుంది.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న పరిశ్రమను ఆ రికార్డుకు వేదిక చేసుకుంది. 1000/800 స్థలంలో 1,845 బైకులను వరుస క్రమంలో పేర్చి రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఫీట్ కోసం దాదాపు 90 రోజుల పాటు సంస్థ ప్రణాళికలు వేసింది. 300 గంటల పాటు సిబ్బంది పనిచేశారు.