మాస్క్​ పెట్టుకోండన్నందుకు.. పోలీసులను కొట్టి నానా హంగామా చేసిన ఇద్దరు మహిళలు.. వీడియో వైరల్​

11-08-2021 Wed 13:55
  • ఢిల్లీ మెట్రో వద్ద ఘటన
  • పోలీసులను బూతులు తిట్టిన వైనం
  • ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
Women Attack Cops For Asking To wear Mask
మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు పోలీసులపై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. నానా హంగామా చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని మెట్రో స్టేషన్ వద్ద జరిగింది. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాస్క్ లేకుండా తిరుగుతున్న ఇద్దరు మహిళలను గుర్తించిన పోలీసులు.. మాస్కు పెట్టుకోవాల్సిందిగా సూచించారు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళలు పోలీసులను బూతులు తిట్టారు. వీరంగం వేసి అక్కడున్న వారిపైనా దాడి చేశారు. ఓ మహిళా పోలీసును ఈడ్చి కొట్టారు. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.