ఒకే కారులో.. పక్కపక్కనే.. తారక్​, చెర్రీ ‘దోస్తీ’తో దొరికేశారు!: వీడియో ఇదిగో

11-08-2021 Wed 12:48
  • ఇటీవలే విడుదలైన దోస్తీ సాంగ్
  • కార్ లో హమ్ చేస్తూ కనిపించిన హీరోలు
  • వీడియో పోస్ట్ చేసిన డీవీవీ ఎంటర్ టైన్మెంట్
Bheem and Ramaraju Hooked To Dosti Song
రెండు పరస్పర భిన్న ధ్రువాలు కలుసుకోవడం సాధ్యమా! అస్సలు కాదనేకదా సమాధానం. అలాంటి పరస్పర భిన్న ధ్రువాలు ‘దోస్తీ’తో కలిసి.. వైరం వరకు వెళితే? అదే కథాంశంతో ఎన్నో అంచనాలతో అందరి ముందుకు రాబోతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబో అనగానే ఎన్ని అంచనాలు పుట్టాయో తెలిసిందే.

ప్రస్తుతం ఉక్రెయిన్ లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా నుంచి ‘ఫ్రెండ్ షిప్ డే’ స్పెషల్ సాంగ్ ‘దోస్తీ’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ పాటకు మంచి స్పందన వచ్చింది. అయితే, తాజాగా ఆ పాటను పాడుతూ తారక్, చెర్రీలు కనిపించారు.

కార్ లో పక్కపక్కనే కూర్చుని పాట హిందీ వెర్షన్ ను వింటూ హమ్ చేస్తూ ఆ ఇద్దరూ కనిపించారు. ఆ వీడియోను డీవీవీ ఎంటర్ టైన్మెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘‘మీరూ.. మీ స్నేహితులతో కలిసి ‘దోస్తీ’ హమ్ చేస్తున్నారా? అయితే.. మీ వీడియోను పోస్ట్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేయండి’’ అంటూ ట్వీట్ చేసింది.