'స్టూవర్ట్ పురం దొంగ'గా బెల్లంకొండ శ్రీనివాస్ .. పోస్టర్ విడుదల!

11-08-2021 Wed 12:42
  • సెట్స్ పై 'ఛత్రపతి' హిందీ రీమేక్
  • తెలుగులో గజదొంగ బయోపిక్
  • దర్శకుడిగా కేఎస్ పరిచయం
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
Stuvart Puram Donga Poster released
బెల్లంకొండ శ్రీనివాస్ యువ కథానాయకులకు గట్టి పోటీ ఇచ్చే దిశగా దూసుకుపోతున్నాడు. ఒక వైపున యూత్ ను .. మరో వైపున మాస్ ను ఆకట్టుకునే ప్రయత్నంలో చాలావరకూ సక్సెస్ అయ్యాడు. ఆయన తాజా చిత్రంగా హిందీలో 'ఛత్రపతి' రీమేక్ రూపొందుతోంది. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది.

ఆ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ ఒక బయోపిక్ లో చేయనున్నాడు. అది 1970 ప్రాంతానికి చెందిన 'టైగర్ నాగేశ్వరరావు' అనే ఒక గజదొంగ బయోపిక్. ఈ సినిమాకి 'స్టూవర్ట్ పురం దొంగ' అనే టైటిల్ ను ఖరారు చేసి, తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాను బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తుండగా, దర్శకుడిగా కేఎస్ పరిచయమవుతున్నాడు.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానుంది. మణిశర్మ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి పనిచేసే ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను తెలియపరుస్తామని మేకర్స్ తెలియజేశారు. మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఒక విభిన్నమైన లుక్ తో కనిపించనున్నాడన్న మాట.