West Africa: మార్‌బర్గ్ వైరస్ సోకిన వ్యక్తి  తర్వాతి రోజే మృతి..  చికిత్స లేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • గినియాలోని గేక్కేడౌలో వెలుగు చూసిన వైరస్
  • ఈ నెల 1న వైరస్ బారినపడిన బాధితుడు, తర్వాతి రోజు మృతి
  • ఇంచుమించు కరోనా లక్షణాలే
  • కొవిడ్‌తో పోలిస్తే మరణాలు అధికం
West Africa records 1st death from highly infectious Marburg virus

కొవిడ్ నుంచి ప్రపంచం ఇంకా బయటపడకముందే మరో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. పశ్చిమాఫ్రికా దేశమైన గినియాలోని గేక్కేడౌలో మార్‌బర్గ్ అనే వైరస్ బారినపడి ఈ నెల 2న ఓ వ్యక్తి మరణించాడు. అతడు అంతకుముందు రోజే ఆ వైరస్ బారినపడ్డాడు. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని, సోకిన తర్వాత ఏడు రోజులపాటు తీవ్ర ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దీనివల్ల రక్తనాళాలు కూడా చిట్లిపోతాయి. దీని బారినపడితే 24-88 శాతం వరకు మరణించే అవకాశం ఉంటుంది.ఈ వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ కానీ, చికిత్సా విధానం కానీ లేవని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వైరస్ కూడా ఎబోలా జాతికి చెందినదేనని పేర్కొంది.

కాగా, ప్రస్తుతం మార్‌బర్గ్ వైరస్ బయటపడిన చోటనే గతంలో ఎబోలా కూడా బయటపడింది. ఈ వైరస్‌కు కూడా కొవిడ్ లాంటి లక్షణాలే ఉంటాయి. రోగితో ప్రత్యక్ష సంబంధం ఉన్న వారికి, రోగి స్రావాలను, రోగి తాకిన ఉపరితలాలను, వస్తువులను తాకడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. కరోనాతో 1 నుంచి 5 శాతం లోపు మరణాలు సంభవిస్తే దీని వల్ల అత్యధిక మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News