తెలంగాణ రోజువారీ కొవిడ్ కేసుల వివరాలు ఇవిగో!

10-08-2021 Tue 20:41
  • గత 24 గంటల్లో 89,037 కరోనా పరీక్షలు
  • 494 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 80 కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 8,112 మందికి చికిత్స
Telangana daily report of covid cases and deaths
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 89,037 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 494 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 80 కేసులు వెలుగు చూశాయి. కరీంనగర్ జిల్లాలో 51, వరంగల్ అర్బన్ జిల్లాలో 45 కొత్త కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 621 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,50,353 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,38,410 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,112 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,831కి చేరింది.