గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్

10-08-2021 Tue 20:06
  • గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి కుమార్తె పెళ్లి
  • మంగళగిరిలో వివాహం
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
  • సీఎం రాకతో కోలాహలం
CM Jagan attends mines and geology director Venkat Reddy daughter wedding
సీఎం జగన్ కొద్దిసేపటి కిందట మంగళగిరి చేరుకున్నారు. అక్కడ జరిగిన గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి కుమార్తె అఖిలారెడ్డి వివాహానికి హాజరయ్యారు. అఖిలారెడ్డి వివాహం గౌతమ్ రెడ్డితో జరిగింది. ఈ పెళ్లికి విచ్చేసిన సీఎం జగన్ వధూవరులను ఆశీర్వదించారు. సీఎం రాకతో పెళ్లిమంటపం వద్ద మరింత సందడి పెరిగింది. ఆయనతో ఫొటోలకు ఉత్సాహం చూపించారు.