మహేశ్ తో సినిమా ఉందన్న 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్!

10-08-2021 Tue 19:29
  • 'అర్జున్ రెడ్డి'తో హిట్టు 
  • బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులు 
  • మహేశ్ కి వినిపించిన లైన్
  • ఇంకా కొలిక్కిరాని కథా చర్చలు  
Sandeep Reddy gave a claruty on Mahesh Babu movie
మహేశ్ బాబుతో సినిమా చేయాలనే కోరిక ప్రతి దర్శకుడికి ఉంటుంది. అందువలన కథ రెడీ చేసుకుని ఆయనను కలిసే దర్శకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే మహేశ్ ను కథల విషయంలో ఒప్పించడం కష్టమే. ఆల్రెడీ హిట్ ఇచ్చి ఉండాలి .. ప్రస్తుతం తనకి వినిపించే కథ చాలా కొత్తగా ఉందనిపించాలి .. అప్పుడే ఆయన ఓకే అనే అవకాశం ఉంటుంది.

అలాంటి మహేశ్ బాబుకు తాను కథ వినిపించానని ఆ మధ్య 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా చెప్పాడు. ఆ తరువాత ఆ ప్రస్తావన లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు లేనట్టేనని అంతా అనుకున్నారు. అందుకు తగినట్టుగా వరుసగా ఆయన హిందీలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

ఈ నేపథ్యంలో మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా సందీప్ రెడ్డి ఈ ప్రాజెక్టును గురించి ప్రస్తావించాడు. ఈ ప్రాజెక్టు లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. మహేశ్ కి లైన్ నచ్చిందనీ .. చర్చల దశలో కథ ఉందని అన్నాడు. తమ కాంబినేషన్లో సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పాడు. అయితే మహేశ్ ఈ ప్రాజెక్టు ఊసెత్తకపోవడమే కొసమెరుపు.