'బొమ్మల కొలువు' నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్!

10-08-2021 Tue 18:08
  • క్రైమ్ థ్రిల్లర్ గా 'బొమ్మల కొలువు'
  • దర్శకుడిగా సుబ్బు వేదుల పరిచయం 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
Bommala Koluvu trailer released
ఈ మధ్య కాలంలో తెలుగు తెరపైకి సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లు .. క్రైమ్ థ్రిల్లర్లు ఎక్కువగా వస్తున్నాయి. అలా త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ ఒకటి రానుంది. ఆ  సినిమా పేరే 'బొమ్మల కొలువు'. ఏవీఆర్ స్వామి నిర్మిస్తున్న  ఈ సినిమాతో, సుబ్బు వేదుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

తాజాగా  ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అందమైన అమ్మాయిలను వరుసగా కిడ్నాప్ చేయడం ... ఆ తరువాత వాళ్లను హత్య చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ల శవాలను ప్యాక్ చేసి రహస్యంగా పారేయడం చేస్తుంటాడు. అదృశ్యమైన యువతులకి సంబంధించిన వారు పోలీస్ స్టేషన్ నుంచి ఫిర్యాదులను వెనక్కి తీసుకోవడమే ఇక్కడ విచిత్రం.

అమ్మాయిలను టార్గెట్ చేసిన ఆ వ్యక్తి ఎవరు?  ఫిర్యాదులను అందరూ ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు? 'బొమ్మల కొలువు'కు .. ఈ కథకు మంధ్య లింక్ ఏంటి? అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. 'రఘువరన్ బీటెక్'లో ధనుశ్ తమ్ముడిగా చేసిన హృషీకేశ్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ముఖ్యపాత్రల్లో ప్రియాంక శర్మ .. మాళవిక సతీషన్ కనిపించనున్నారు.