వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం!

10-08-2021 Tue 17:23
  • వైష్ణవ్ హీరోగా మరో సినిమా
  • దర్శకుడిగా గిరీశాయ  
  • కథానాయికగా కేతిక శర్మ
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
 Vaishnav Tej new movie shooting started
వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన 'ఉప్పెన' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా చూసినవారెవరూ కూడా ఇది వైష్ణవ్ కి ఫస్టుమూవీ అనుకోలేదు .. అంత ఈజ్ తో చేశాడు. ఇండస్ట్రీకి మరో యంగ్ హీరో దొరికేశాడనే టాక్ వచ్చింది. యూత్ లో కావలసినంత క్రేజ్ దొరికింది. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతూ వస్తున్నారు.

అయితే వైష్ణవ్ ప్రతి కథకు ఓకే చెప్పకుండా, తనకి బాగా నచ్చిన కథను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అలా కొన్ని రోజుల క్రితమే ఆయన గిరీశాయ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ సినిమా ఇప్పుడు షూటింగును మొదలెట్టింది.

ఈ సినిమాకి బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ అలరించనుంది. 'అర్జున్ రెడ్డి' సినిమాను తమిళంలో రీమేక్ చేసిన గిరీశాయ ఆశించినస్థాయి హిట్ ను అందుకోలేకపోయాడనే విషయం తెలిసిందే.