మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు కరోనా పాజిటివ్

10-08-2021 Tue 15:57
  • ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్
  • ఆదివారం నల్గొండ సభలో పాల్గొన్న వైనం
  • బీఎస్పీలో చేరిక
  • రెండ్రోజుల నుంచి నీరసంగా ఉందని వెల్లడి
  • స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్టు వివరణ
Former IPS Praveen Kumar tested corona positive
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కు కరోనా సోకింది. రెండ్రోజులుగా నీరసంగా ఉండడంతో కొవిడ్ టెస్టు చేయించుకున్నానని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఆ టెస్టులో కరోనా పాజిటివ్ అని వచ్చిందని, దాంతో గాంధీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నానని, ఆపై డిశ్చార్జి అయ్యానని వెల్లడించారు.  

తాను స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. తనతో సన్నిహితంగా మెలిగినవారు దయచేసి ఐసోలేషన్ లోకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

మొన్న ఆదివారం నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సభలోనే ఆయన బీఎస్పీ కండువా కప్పుకున్నారు. ప్రవీణ్ కుమార్ కు బీఎస్పీ అధిష్ఠానం రాష్ట్ర సమన్వయ కర్త పదవిని అప్పగించింది.