పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఎన్నిక

10-08-2021 Tue 15:40
  • పీఏసీలో విజయసాయిరెడ్డికి స్థానం
  • మరో సభ్యుడిగా బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది
  • బులెటిన్ విడుదల చేసిన రాజ్యసభ ప్రధాన కార్యదర్శి
  • కేంద్ర ఆదాయ, వ్యయాలను పరిశీలించనున్న పీఏసీ
Vijayasai Reddy elected as PAC member
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఎన్నికయ్యారు. విజయసాయిరెడ్డితో పాటు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కూడా పీఏసీలో సభ్యుడిగా కొనసాగుతారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రధాన విధి కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను, ప్రభుత్వ ఖాతాలను పరిశీలించడం. కాగా, తాజా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటుపై రాజ్యసభ ప్రధాన కార్యదర్శి దేశ్ దీపక్ శర్మ పార్లమెంటు బులెటిన్ ద్వారా వెల్లడించారు. విజయసాయి, సుధాంశు త్రివేది ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పేర్కొన్నారు.