షూటింగులో గాయపడ్డ ప్రకాశ్ రాజ్... శస్త్రచికిత్స కోసం హైదరాబాదుకు పయనం

10-08-2021 Tue 15:22
  • కిందపడిన ప్రకాశ్ రాజ్
  • ఎముక స్వల్పంగా విరిగిన వైనం
  • శస్త్రచికిత్స చేయనున్న డాక్టర్ గురవారెడ్డి
  • ఆందోళన చెందాల్సిందేమీ లేదన్న ప్రకాశ్
Injured Prakash Raj will take on bone surgery in Hyderabad
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ షూటింగ్ లో గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రంలో ప్రకాశ్ రాజ్ కూడా నటిస్తున్నారు. చెన్నైలో షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. కిందపడడంతో ఎముక స్వల్పంగా విరిగిందని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

శస్త్రచికిత్స కోసం హైదరాబాదు వస్తున్నానని, తన మిత్రుడు డాక్టర్ గురవారెడ్డి (ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు) సురక్షితమైన హస్తాలతో సర్జరీ చేయించుకోబోతున్నానని ప్రకాశ్ రాజ్ వివరించారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. సెప్టెంబరులో మా ఎన్నికలు జరగనున్నాయి.