ఆంధ్రా వంటకాలకు బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఫిదా... వీడియో ఇదిగో!

10-08-2021 Tue 14:36
  • గుంటూరు జిల్లా కాజ వద్ద ఓ హోటల్లో లంచ్
  • ఆంధ్రా వంటకాలు బాగున్నాయని కితాబు   
  • విజయవాడలో వాసిరెడ్డి పద్మతో భేటీ
  • పలు అంశాలపై చర్చ
Britain High Commissioner Andrew Fleming lunch with Andhra food items
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న ఆండ్రూ ఫ్లెమింగ్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విశేషంగా గౌరవిస్తుంటారు. తాజాగా ఆయన ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కాజ గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న మురుగన్ హోటల్లో భోజనం చేశారు.

మామూలుగా స్పూన్లు, ఫోర్క్ లు, నైఫ్ లతో తినడానికి అలవాటు పడిన ఆయన ఆంధ్రా వంటకాలతో కూడిన భోజనాన్ని చేత్తో కలుపుకుని తినేందుకు కొంచెం ఇబ్బంది పడినా, తెలుగు రుచికి ఫిదా అయ్యారు. ఆంధ్రా భోజనం ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

కాగా, ఏపీ పర్యటనకు వచ్చిన డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ను విజయవాడలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కలిశారు. లింగ వివక్ష, రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం తీసుకుంటున్న చర్యలను ఆమె బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ కు వివరించారు.