Andhra Pradesh: ఏపీకి 10 బ్యాంకుల నుంచి రూ.56,076 కోట్ల రుణాలు.. ఏ బ్యాంకు నుంచి ఎంతో వివరాలను వెల్లడించిన కేంద్రం

AP Gets Rs 56000 cr Loans From 10 Banks Says Center
  • టీడీపీ ఎంపీ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం
  • అత్యధికంగా ఎస్బీఐ నుంచి రూ.15,047 కోట్లు
  • ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.9,450 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పది ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు రుణాలనిచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2019 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా బ్యాంకులు అందించిన రుణాల వివరాలను వెల్లడించింది. మొత్తంగా ఈ రెండేళ్లలో 10 బ్యాంకుల నుంచి రూ.56,076 కోట్ల రుణాలను ఏపీ సర్కార్ పొందిందని తెలిపింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా బదులిచ్చింది.

అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.15,047 కోట్ల రుణాలు అందాయని పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.9,450 కోట్లను రుణంగా ఇచ్చిందని కేంద్రం తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.7,075 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.5,797 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.4,300 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.2,800 కోట్లు ఇచ్చాయని చెప్పింది. కెనరా బ్యాంక్ నుంచి రూ.2,307 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రూ.750 కోట్లను ఏపీ రుణాలుగా పొందిందని వెల్లడించింది.
Andhra Pradesh
Union Government
Debt
Parliament
Telugudesam

More Telugu News