హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ మరణం పార్టీకి తీరని లోటు: రేవంత్ రెడ్డి

10-08-2021 Tue 14:31
  • గుండెపోటుతో మృతి చెందిన హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్
  • ఒక మంచి నాయకుడిని కోల్పోయామన్న రేవంత్
  • పార్టీ కోసం ఎంతో క్రమశిక్షణతో పని చేశారని కితాబు
Congress lost good leader Raj Kumar says Revanth Reddy
కాంగ్రెస్ నేత, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఆయన అన్నారు. పార్టీ కోసం ఆయన ఎంతో క్రమశిక్షణతో పని చేశారని కొనియాడారు.

ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు ఇతర నేతలు కూడా రాజ్ కుమార్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.