'పప్పు' అనే పదంపై నిషేధం విధించిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ

10-08-2021 Tue 11:37
  • ఇప్పటి వరకు 1,161 పదాలు, వాక్యాలను నిషేధించిన అసెంబ్లీ
  • నిషేధిత పదాల జాబితాను విడుదల చేసిన స్పీకర్
  • 38 పేజీల బుక్ లెట్ ను ఎమ్మెల్యేలకు అందించిన వైనం
Word Pappu banned in Madhya Pradesh assembly
అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. ఒక్కోసారి సభ్యులు తమ పరిధులు దాటి ఎదుట వ్యక్తులపై విమర్శలు గుప్పిస్తుంటారు. పలు అభ్యంతరకరమైన పదాలను వాడుతుంటారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. పప్పు, వెంటిలేటర్, మిస్టర్ బంటాధార్, చోర్ వంటి పదాలను సభలో పలకకుండా నిషేధం విధించింది.

ఈ క్రమంలో సభలో ఏయే పదాలను పలకకూడదో వాటి జాబితాను అసెంబ్లీ స్పీకర్ విడుదల చేశారు. 1954 నుంచి ఇప్పటి వరకు నిషేధిస్తూ వస్తున్న పదాలు, వాక్యాల సంఖ్య 1,161కి చేరుకుంది. వీటికి సంబంధించి 38 పేజీల బుక్ లెట్ ను ఎమ్మెల్యేలకు అందించారు. పప్పు అనే పదాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించేందుకు బీజేపీ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.