ఇలాంటి అవ‌మానాలు చాలా ఎదుర్కొన్నాను: సింగ‌ర్ సునీత‌

10-08-2021 Tue 10:16
  • పాట పాడ‌డానికి స్టూడియోకి వెళ్లాను
  • సంగీత‌ ద‌ర్శ‌కుడు మైక్ ఇచ్చారు
  • ఆయ‌న భార్య చూసింది
  • త‌న భ‌ర్త చేతిని ఎందుకు తాకావ‌ని అడిగింది
sunita shares about her bitter experience
సింగ‌ర్ సునీత తాజాగా సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్రేక్ష‌కుల‌తో ముచ్చ‌టిస్తూ ప‌లు విష‌యాలు వెల్లడించింది. ఈ సందర్భంగా, ఓసారి పాట పాడేందుకు వెళ్లి ఎదుర్కొన్న అవ‌మానాన్ని గురించి కూడా వివ‌రించింది.

"ఓ రోజు ఓ ప్రముఖ సంగీత దర్శకుడి స్టూడియోలో పాట పాడేందుకు వెళ్లాను. మ్యూజిక్ డైరెక్టర్ నా చేతికి మైక్ ఇచ్చాడు. పాట పాడిన తర్వాత మళ్లీ ఆ మైక్ ను అక్కడే పెట్టేశాను. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ సంగీత‌ ద‌ర్శ‌కుడి భార్య నన్ను పిలిచి అవ‌మానించింది.

ఆయన నుంచి మైక్ తీసుకుంటోన్న‌ సమయంలో ఆయన వేళ్లను ఎందుకు తాకావు? అసలు ఏమనుకుంటున్నావ్ నువ్వు? అంటూ చెడామడా తిట్టేసింది. నేను స్టన్ అయ్యాను.. తర్వాత తేరుకుని నేనూ అదే లెవెల్లో ఆమెకు జవాబు చెప్పాను. అయితే, ఈ ఘటనతో నేను బాగా హర్ట్ అయ్యాను. తట్టుకోలేకపోయాను.. ఇంటికెళ్లాక ఆ రోజు రాత్రి బాగా ఏడ్చేశాను. ఇటువంటి ఘటనలు నా జీవితంలో ఎన్నో జరిగాయి" అంటూ చెప్పుకొచ్చింది.