ఏపీలో కరోనా కొత్త రూల్స్.. వివాహాలకు 150 మందికే పరిమితం

10-08-2021 Tue 09:46
  • కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు
  • శుభకార్యాలు, మతపరమైన సమావేశాలకు పరిమితి
  • సీటుకు సీటుకు మధ్య ఎడం పాటించాలంటూ ఉత్తర్వులు
New corona rules in andhrapradesh
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై వివాహాలు, ఇతర శుభకార్యాలతోపాటు మతపరమైన సమావేశాల్లో పాల్గొనేవారి సంఖ్య 150కి మించరాదని ప్రభుత్వం పేర్కొంది. వేదికలు, ఇతర చోట్ల సీట్లు పక్కపక్కనే ఉంటే మధ్యలో ఒకదానిని విడిచిపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీట్లు కనుక ముందుగా అమర్చకుండా ఉంటే ఒక సీటుకు మరో సీటుకు మధ్య ఐదడుగుల దూరాన్ని పాటించాలని సూచించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.