జీహెచ్ఎంసీ పరిధిలో నేటి నుంచి సంచార వాహనాల ద్వారా టీకాల పంపిణీ

10-08-2021 Tue 09:22
  • నేడు 74 సంచార టీకా వాహనాల ప్రారంభం
  • కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో టీకాలు
  • దశల వారీగా వాహనాల సంఖ్య 100కు పెంపు
Mobile vaccination starts in ghmc from today
జీహెచ్ఎంసీ పరిధిలో నేటి నుంచి సంచార టీకా కార్యక్రమం మొదలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిన్న వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో సంచార టీకా వాహనాల ద్వారా వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు 74 సంచార కొవిడ్ టీకా వాహనాలను ప్రారంభించనున్నారు. దశల వారీగా వీటిని 100కు పెంచనున్నట్టు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు.