సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

10-08-2021 Tue 07:24
  • 'ఉమ' షూటింగు పూర్తిచేసిన కాజల్ 
  • డబ్బింగ్ మొదలెట్టిన వరుణ్ తేజ్
  • మళ్లీ తెరపైకి వస్తున్న మహేశ్ సోదరి
Kajal Agarwal completes her Hindi film Uma
*  ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న కథానాయిక కాజల్ అగర్వాల్.. మరోపక్క హిందీలో 'ఉమ' అనే సినిమాలో నటిస్తోంది. నెల రోజుల క్రితం ఈ చిత్రం షూటింగు కోల్ కతాలో మొదలైంది. తాజాగా కాజల్ తన షూటింగును పూర్తిచేసేసిందట. ఇందులో కాజల్ విభిన్న తరహా పాత్రలో కనిపిస్తుంది.
*  మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గని'. కిరణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా, నిన్నటి నుంచి డబ్బింగ్ ను నిర్వహిస్తున్నారు. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది.
*  మహేశ్ బాబు సోదరి మంజుల మరోసారి నటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుమంత్, నైనా గంగూలీ జంటగా నటిస్తున్న 'మళ్లీ మొదలైంది' చిత్రంలో మంజుల కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆమె డాక్టర్ మిత్రా పాత్రలో కనిపిస్తారు.