రఘురామపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు... చర్యలు తీసుకుంటామన్న నిర్మలా సీతారామన్

09-08-2021 Mon 22:05
  • కేంద్రానికి లేఖ రాసిన విజయసాయిరెడ్డి
  • రఘురామపై ఫిర్యాదు
  • ఓ చానల్ చైర్మన్ తో లావాదేవీలపై నిగ్గు తేల్చాలని వినతి
  • స్పందించిన నిర్మల
Nirmala Sitharaman responds after Vijayasai Reddy complained against Raghurama Krishnaraju
ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఓ తెలుగు టీవీ చానల్ చైర్మన్ కు, రఘురామకృష్ణరాజుకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల నిగ్గు తేల్చాలని, దీనిపై విచారణకు ఆదేశించాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన నిర్మలా సీతారామన్.... విజయసాయిరెడ్డి లేఖలోని అంశాలపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాగా, విజయసాయి తన లేఖలో రఘురామకు, చానల్ చైర్మన్ కు మధ్య జరిగిన చాటింగ్ అంటూ కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు. ఇరువరి మధ్య ఒక మిలియన్ యూరోల హవాలా లావాదేవీలు జరిగాయని విజయసాయి ఆరోపించారు. ఆ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఫెమా ఉల్లంఘనలు జరిగాయని వివరించారు. అనంతరం 15 మంది ఎంపీల సంతకాలతో ఆ లేఖ ప్రతిని నిర్మలకు అందించారు.