'105 మినిట్స్' నుంచి హన్సిక ఫస్టులుక్ రిలీజ్!

09-08-2021 Mon 18:29
  • గ్లామరస్ హీరోయిన్ గా క్రేజ్
  • తమిళ సినిమాలతోనే బిజీ 
  • అడపా దడపా తెలుగు సినిమాలు
  • సస్పెన్స్ థ్రిల్లర్ గా '105 మినిట్స్'
Haniska first look released from 105 minutes
తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా హన్సికకు మంచి క్రేజ్ ఉంది. తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఆమె ఒక వెలుగు వెలుగుతోంది. ఇక తనకి వీలైనప్పుడల్లా తెలుగు సినిమాలు కూడా చేస్తూనే ఉంది. మొదటి సినిమా 'దేశముదురు' నుంచి ఇప్పటి వరకూ ఇక్కడ ఆమెకి పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు.

'కందిరీగ' ... 'పవర్' వంటి హిట్లు ఉన్నప్పటికీ, తమిళంలో బిజీగా ఉండటం వలన టాలీవుడ్ పై పెద్దగా దృష్టిపెట్టలేకపోయింది. ఇక ఇప్పుడు ఆమె తాజా చిత్రంగా 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' సినిమా రూపొందుతోంది. బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ రోజున హన్సిక పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి హన్సిక ఫస్టులుక్ ను వదిలారు. గతంలో హన్సిక తో 'పవర్' సినిమాను చేసిన దర్శకుడు బాబీతో, ఈ ఫస్టులుక్ ను రిలీజ్ చేయించారు. ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా టీమ్ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.