'రిపబ్లిక్' నుంచి జగపతిబాబు లుక్ రిలీజ్

09-08-2021 Mon 18:01
  • దేవ కట్టా ఎంచుకునే కథలు వేరు 
  • ఆశయం .. ఆవేశం చుట్టూ తిరిగే పాత్రలు 
  • కీలక పాత్రలో రమ్యకృష్ణ 
  • మణిశర్మ సంగీతం హైలైట్
jagapathi Babu poster released in Republic movie
విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా దేవ కట్టాకు మంచి పేరు ఉంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రమే 'రిపబ్లిక్'. అవినీతికి .. ఆవేశానికి మధ్య నడిచే కథ ఇది. అవినీతి రాజకీయాలను అడ్డుకుంటూ తిరుగుబాటు సాగించే యువత చుట్టూ తిరిగే కథ ఇది. భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ సినిమా  విడుదలకు ముస్తాబవుతోంది.

సాయితేజ్ సరసన నాయికగా ఐశ్వర్య రాజేశ్ నటించిన ఈ సినిమాలో, రమ్యకృష్ణ .. జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషించారు. ఆల్రెడీ ఇంతకుముందే రమ్యకృష్ణ లుక్ తో పోస్టర్ ను వదిలారు. తాజాగా జగపతిబాబును 'దశరథ్' పాత్రలో పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చూడటానికైతే ఆయన లుక్ చాలా సాఫ్ట్ గానే అనిపిస్తోంది.

'దీపాలు పోరాటం ఆపినప్పుడే చీకటి గెలుస్తుంది' అనే క్యాప్షన్ ను నినాదం తరహాలో పోస్టర్ పై రాశారు. బహుశా సినిమా ద్వారా ఇచ్చే సందేశం ఇదే అయ్యుంటుంది. మణిశర్మ సంగీతం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సుబ్బరాజు .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలోనే విడుదల కానుంది.