Jagan: హజ్ హౌస్ ల నిర్మాణం, క్రిస్టియన్ భవన్ పెండింగ్ పనులకు ఏపీ సీఎం జగన్ ఆమోదం

  • మైనార్టీ శాఖపై సమీక్ష నిర్వహించిన జగన్
  • వక్ఫ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ఆదేశం
  • మైనార్టీలకు కొత్త శ్మశానాల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశాలు
Jagan orders to construct Huz houses

వక్ఫ్ భూములను కాపాడేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని... ఆ భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని చెప్పారు. జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్ ఆస్తుల సర్వే కూడా చేపట్టాలని చెప్పారు. మైనార్టీల అవసరాలకు తగ్గట్టుగా కొత్త శ్మశానాల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు.

మైనార్టీల సబ్ ప్లాన్ కోసం రూపొందించిన ప్రతిపాదనలపై తగిన చర్యలు తీసుకోవాలని జగన్ చెప్పారు. ఇమామ్ లు, మౌజంలు, పాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాలను చెల్లించాలని అన్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో హజ్ హౌస్ ల నిర్మాణానికి జగన్ ఆమోదం తెలిపారు. దీనికి తోడు... అసంపూర్ణంగా ఉన్న క్రిస్టియర్ భవన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీకి ప్రాధాన్యతనిచ్చి పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. షాదీఖానాల నిర్వహణను ఇక నుంచి మైనార్టీ శాఖకు బదిలీ చేయాలని తెలిపారు.

More Telugu News