వీళ్లే నాకు స్ఫూర్తి, ఆశ, బలం... ఆసక్తికర వీడియో పంచుకున్న రేవంత్ రెడ్డి

09-08-2021 Mon 16:58
  • ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ
  • దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో సభ
  • పోలీసులు ప్రజలను అడ్డుకున్నారన్న రేవంత్
  • ప్రజలు 3 కిమీ నడిచి వచ్చారని వెల్లడి
Revanth Reddy tweets a video from Indravelli rally
దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో భారీ సభ ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే ఈ సభకు వచ్చే జనాన్ని పోలీసులు అడ్డుకున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. ఇంద్రవెల్లి సభావేదికకు మూడు కిలోమీటర్ల ఆవలే ప్రజల వాహనాలను పోలీసులు నిలిపివేశారని, అయినప్పటికీ జనాలు కాలినడకన తమ సభకు వచ్చారని రేవంత్ వివరించారు. ఆ వీడియోలో పెద్ద సంఖ్యలో ప్రజలు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఉన్నాయి. దీనిపై రేవంత్ స్పందిస్తూ, వాళ్లే తన స్ఫూర్తి, వాళ్లే తన ఆశ, వాళ్లే తన బలం అని స్పష్టం చేశారు.