సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ అంశంలో ఏపీ సీఎస్ కు లేఖ రాసిన కేంద్ర హోంశాఖ

09-08-2021 Mon 16:26
  • సీఐడీ అధికారి సునీల్ కుమార్ పై రఘురామ లేఖ
  • లేఖను పరిశీలించిన కేంద్రం
  • రఘురామ లేఖపై స్పందించిన హోంశాఖ
  • లేఖలోని అంశాలను పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ కు సూచన
Union Govt wrote AP CS on CID ADG Sunil Kumar issue
ఇటీవల ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ పై ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. రఘురామ ఫిర్యాదును పరిశీలించిన కేంద్ర హోంశాఖ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాసింది. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు ప్రతిని ఏపీ సీఎస్ కు పంపింది. లేఖలోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.

అంతకుముందు, సునీల్ కుమార్ భార్య గృహహింస కేసులో చార్జిషీటు దాఖలైన కారణంగా ఆయనను ప్రాధాన్యంలేని శాఖకు బదిలీ చేయాలని తన లేఖలో కోరారు.