పోలవరం నిర్వాసితుల్లోని ఆదివాసీలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది: చంద్రబాబు

09-08-2021 Mon 14:47
  • నేడు ఆదివాసీ దినోత్సవం
  • శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • వైసీపీ సర్కారుపై విమర్శలు
  • ఆదివాసీలకు పరిహారం చెల్లించలేదని ఆరోపణ
  • బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారని ఆగ్రహం
Chandrababu convey wishes to tribal on world tribal day
ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం నిర్వాసితుల్లోని ఆదివాసీలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. పరిహారం చెల్లించకుండానే బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు.

మన్యంలో బాక్సైట్ తవ్వకాలను వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, గిరిజనుల భవితవ్యాన్ని కాలరాస్తోందని తెలిపారు. ఇప్పటికైనా గిరిజన సంక్షేమ పథకాలు కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.