passes away: తెలంగాణ‌ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కేశ‌వ‌రావు క‌న్నుమూత‌.. నేడు కోర్టుల‌న్నింటికీ సెల‌వు

  • జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో మ‌ధ్యాహ్నం అంత్య‌క్రియ‌లు
  • కేశవరావు మరణం పట్ల కేసీఆర్ సంతాపం
  • అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశం
kesava rao passes away

అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఇటీవ‌ల‌ యశోద ఆసుప‌త్రిలో చేరిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి. కేశవరావు(60) కన్నుమూశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని కోర్టులకు ఉన్నత న్యాయస్థానం ఈ రోజు సెలవు ప్రకటించింది.
 
జస్టిస్ కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు పేదలకు అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్ కుమార్ కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. న్యాయమూర్తి కేశ‌వ‌రావు మృతి పట్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, త‌దితరులు సంతాపం తెలిపారు.

More Telugu News