'ఎఫ్ 3'పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి!

  • 'ఎఫ్ 3' డిఫరెంట్ స్టోరీ 
  • 'ఎఫ్ 2'కి కొనసాగింపు కాదు 
  • సునీల్ పాత్ర సంథింగ్ స్పెషల్
Anil Ravipudi gave a clarity on F3 movie

అనిల్ రావిపూడి - దిల్ రాజు కాంబినేషన్లో గతంలో వచ్చిన 'ఎఫ్ 2' చేసిన సందడి అంతా ఇంతా కాదు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేసింది. భార్యాభర్తలు పెళ్లైన కొత్తలో ఎలా ఉంటారు? ఆ తరువాత ఎలా మారిపోతారు? అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అందువలన భారీ వసూళ్లను రాబట్టింది.

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. తమన్నా .. మెహ్రీన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, వారి కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అనిల్ రావిపూడి కెరియర్ కి మరింత బూస్ట్ ను ఇచ్చింది. దాంతో ఆయన 'ఎఫ్ 3' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'ఎఫ్ 2'కి ఈ సినిమా సీక్వెల్ అని అంతా చెప్పుకుంటున్నారు.

తాజాగా ఈ విషయంపై అనిల్ రావిపూడి స్పందిస్తూ .. " ఇది 'ఎఫ్ 2' సినిమాకి కొనసాగింపు కానే కాదు. కథ .. కథనం .. పాత్రలు .. వాటి నేపథ్యాలు పూర్తిగా మారిపోతాయి. ప్రధానమైన కథా వస్తువు పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. వినోదాన్ని పంచే విషయంలో తప్ప, మరెక్కడా 'ఎఫ్ 2'ను టచ్ చేయడం జరగలేదు. ఈ సినిమాలో కొత్తగా వచ్చి చేరింది సునీల్ మాత్రమే. ఆయన కామెడీ ఈ సినిమాకి బోనస్" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News