'సర్కారువారి పాట' నుంచి బర్త్ డే బ్లాస్టర్!

09-08-2021 Mon 10:26
  • ఈ రోజు మహేశ్ బర్త్ డే 
  • స్పెషల్ టీజర్ విడుదల  
  • మరింత హ్యాండ్సమ్ గా మహేశ్ 
  • సంక్రాంతికి సినిమా విడుదల    
Sarkaru Vaari Paata teaser released
మహేశ్ బాబు హీరోగా 'సర్కారువారి పాట' నిర్మితమవుతోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. ఈ రోజున మహేశ్ బాబు బర్త్ డే .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి 'బర్త్ డే బ్లాస్టర్' పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు.

దుబాయ్ లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్ నుంచి కట్ చేసిన ఫైట్ సీన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ టీజర్ ను వదిలారు. కీర్తి సురేశ్ తో రొమాన్స్ .. వెన్నెల కిశోర్ తో కలిసి కామెడీకి సంబంధించిన బిట్స్ ను చూపించారు. దాంతో పరశురామ్ మార్కు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందనే నమ్మకాన్ని ఈ టీజర్ కలిగిస్తోంది.

ముఖ్యంగా మహేశ్ బాబు కొత్త లుక్ ప్రత్యేక ఆకర్షణగానే చెప్పుకోవాలి. సాధారణంగా లుక్ మార్చడానికి మహేశ్ బాబు పెద్దగా ఆసక్తిని చూపించడు .. అంగీకరించడు. హెయిర్ స్టైల్ విషయంలో మార్పుకు మాత్రమే ఆయన ఓకే చెబుతాడు. అలా కాస్త హెయిర్ స్టైల్ మార్చేసి, ఆయనను మరింత హ్యాండ్సమ్ గా చూపించడంలో పరశురామ్ సక్సెస్ అయ్యాడనే విషయం ఈ టీజర్ బట్టి అర్థమవుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.