Maoist: ఉదారవాద విధానాలను తిప్పికొడితేనే విశాఖ ఉక్కుకు రక్షణ: మావోయిస్టు పార్టీ

  • మహోద్యమంగా మారితే తప్ప పరిశ్రమను రక్షించుకోవడం సాధ్యం కాదు
  • ఉద్యమానికి అందరూ మద్దతు ఇస్తున్నా కేంద్రం వైఖరిలో మార్పు లేదు
  • ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్
Only can protect vizag steel if liberal policies are reversed

విశాఖపట్టణం ఉక్కు పరిశ్రమను ఆషామాషీగా రక్షించుకోవడం సాధ్యం కాదని మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ అన్నారు. సంస్థను రక్షించుకునేందుకు ప్రస్తుతం జరుగుతున్న పోరాటం ఎంతమాత్రమూ సరిపోదని అభిప్రాయపడ్డారు. ఉదారవాద విధానాలను తప్పికొట్టడం ద్వారానే పరిశ్రమను నిలుపుకోవడం సాధ్యమవుతుందన్నారు.

ప్రస్తుత ఉద్యమం ఒకప్పటి ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ వంటి మహోద్యంగా మారితే తప్ప పరిశ్రమను రక్షించుకోలేమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసినట్టు తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంటును రక్షించుకునేందుకు జరుగుతున్న ఉద్యమానికి అందరూ మద్దతు ఇస్తున్నప్పటికీ కేంద్రం వైఖరిలో ఎంతమాత్రమూ మార్పు రావడం లేదని గణేశ్ విమర్శించారు. 

More Telugu News