Telangana: పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించకుండా ఏపీని నిలువరించండి: కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

  • ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు
  • ఏపీపై తెలంగాణ సర్కారు తాజా ఆరోపణలు
  • ఏపీ పరిమితికి మించి నీటిని తీసుకుంటోందని వెల్లడి
  • ఇప్పటికే 25 టీఎంసీలు తీసుకుందని వివరణ
Telangana govt wrote KRMB agains

ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేట్టు కనిపించడంలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ కు లేఖ రాసింది. ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించకుండా ఆపాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఏపీ తన పరిమితికి మించి నీటిని తీసుకుంటోందని ఆరోపించారు. ఏపీ ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని వెల్లడించారు.

నిన్న కూడా తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాసింది. ఈ నెల 9న నిర్వహిస్తున్న కేఆర్ఎంబీ సమావేశానికి తాము హాజరుకావడంలేదని, సమావేశం ఏర్పాటుకు మరో తేదీ నిర్ణయించాలని ఆ లేఖలో కోరింది.

More Telugu News