Mohan Lal: మోహన్ బాబు నివాసంలో మోహన్ లాల్ సందడి... ఫొటోలు ఇవిగో!

Mohan Babu family members hosts a dinner for Mohanlal
  • హైదరాబాద్ విచ్చేసిన మోహన్ లాల్
  • మోహన్ బాబు ఇంట్లో ఆతిథ్యం
  • ఫొటోలు పంచుకున్న మంచు లక్ష్మి
  • ఉల్లాసంగా గడిపిన మోహన్ లాల్, మోహన్ బాబు
మోహన్ లాల్, మోహన్ బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ నట దిగ్గజాలే. ఒకరు మలయాళ చిత్రసీమను ఏలుతుంటే, మరొకరు టాలీవుడ్ లో మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం మరోసారి వెల్లడైంది. తాజాగా మోహన్ లాల్ హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఇంట్లో ఆయనకు విందు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, ఆయన అర్ధాంగి నిర్మలా దేవి, కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు విష్ణు, విరానికా తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పంచుకున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్ మధ్య ఎంతటి సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయో ఈ ఫొటోల ద్వారా అర్థమవుతోంది.
Mohan Lal
Mohan Babu
Dinner
Hyderabad
Manchu Lakshmi
Manchu Vishnu

More Telugu News