India: నాటింగ్ హామ్ టెస్టులో భారత్ 278 ఆలౌట్

India gets crucial lead in Nottingham test
  • ఇంగ్లండ్ తో తొలి టెస్టు
  • ముగిసిన భారత్ మొదటి ఇన్నింగ్స్
  • భారత్ కు 95 పరుగుల ఆధిక్యం
  • రాణించిన కేఎల్ రాహుల్, జడేజా
  • ఆఖర్లో ధాటిగా ఆడిన బుమ్రా
  • రాబిన్సన్ కు 5 వికెట్లు

ఇంగ్లండ్ తో తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 278 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా భారత్ కు కీలకమైన 95 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్వింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై రాహుల్ 214 బంతులాడి 84 పరుగులు చేశాడు. రాహుల్ స్కోరులో 12 ఫోర్లున్నాయి.

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 86 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 56 పరుగులు చేసి రాబిన్సన్ కు వికెట్ అప్పగించాడు. ఆఖర్లో జస్ప్రీత్ బుమ్రా బ్యాట్ ఝళిపించడంతో భారత్ 250 పరుగుల మార్కు దాటింది. బుమ్రా 3 ఫోర్లు, 1 సిక్స్ తో 28 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓల్లీ రాబిన్సన్ 5 వికెట్లు తీయగా, సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 4 వికెట్లు పడగొట్టాడు.

  • Loading...

More Telugu News