Rajasekhar: గోపీచంద్ తో తలపడే విలన్ గా రాజశేఖర్?

Rajasekhar is playing a Villain role in Gopichand movie
  • ఒక వైపున హీరోగా సినిమాలు
  • మరో వైపున విలన్ పాత్రల కోసం వెయిటింగ్
  • శ్రీవాస్ నెక్స్ట్ మూవీ కోసం చర్చలు
  • త్వరలోనే రానున్న స్పష్టత  

తెలుగు తెరపై అటు యాక్షన్ హీరోగాను .. ఇటు ఫ్యామిలీ హీరోగాను పేరు తెచ్చుకున్న అతి తక్కువమంది కథానాయకులలో రాజశేఖర్ ఒకరుగా కనిపిస్తారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేయాలంటే, రాజశేఖర్ తరువాతనే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగాను సాధించిన సక్సెస్ లు ఆయన ఖాతాలో కనిస్తాయి.

అలాంటి రాజశేఖర్ కొంత కాలంగా హీరోగా హిట్ల విషయంలో వెనుకబడ్డారు. అప్పటి నుంచే ఆయన విలన్ పాత్రల వైపు టర్న్ తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్టుల విషయంలో చర్చలు జరిగినప్పటికీ అవి వర్కౌట్ కాలేదు. అందువలన ఒక వైపున హీరోగా చేస్తూనే, విలన్ గా సరైన సినిమా చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నారు.   

ఈ నేపథ్యంలో తన తాజా చిత్రం కోసం దర్శకుడు శ్రీవాస్ .. రాజశేఖర్ ను కలిసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్న శ్రీవాస్, విలన్ పాత్ర కోసం రాజశేఖర్ తో సంప్రదింపులు జరిపినట్టుగా చెప్పుకుంటున్నారు. రాజశేఖర్ సుముఖతను వ్యక్తం చేసినట్టుగానే ప్రచారం జరుగుతోంది. జగపతిబాబు .. శ్రీకాంత్ తరువాత, రాజశేఖర్ కూడా విలన్ పాత్రల వైపు అడుగులు వేస్తున్నారన్న మాట.  

  • Loading...

More Telugu News