'రాజీవ్ ఖేల్ రత్న' పేరు మార్చడంపై తీవ్రస్థాయిలో స్పందించిన రేవంత్ రెడ్డి
- అత్యున్నత క్రీడా పురస్కారంగా 'రాజీవ్ ఖేల్ రత్న'
- 'ధ్యాన్ చంద్ ఖేల్ రత్న'గా మార్చిన కేంద్రం
- ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయన్న మోదీ
- సంకుచిత బుద్ధి అంటూ రేవంత్ విమర్శలు
'రాజీవ్ ఖేల్ రత్న'ను 'ధ్యాన్ చంద్ ఖేల్ రత్న'గా మార్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ, మోదీ సంకుచిత బుద్ధికి నిదర్శనమని విమర్శించారు. దేశంలో క్రీడాభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని రేవంత్ వెల్లడించారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకొని 'రాజీవ్ ఖేల్ రత్న' అవార్డు కొనసాగించాలని స్పష్టం చేశారు.