Team India: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అధిగమించిన భారత్

  • లంచ్ సమయానికి భారత్ 191-5
  • ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 183 
  • 8 పరుగుల స్వల్ప ఆధిక్యంలో భారత్
  • క్రీజులో కేఎల్ రాహుల్, జడేజా
Team India gets lead over England first innings score in Nottingham

నాటింగ్ హామ్ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంపై కన్నేసింది. మూడోరోజు ఆటలో లంచ్ విరామం సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 183 పరుగులకంటే భారత్ ప్రస్తుతం 8 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (77 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (27 బ్యాటింగ్) ఉన్నారు. చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్న నేపథ్యంలో, భారత్ ఏ మేరకు ఆధిక్యం పొందుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

కాగా, మూడో రోజ ఆట ఆరంభమైన కాసేపటికే వరుణుడు ప్రత్యక్షమైనా, కాసేపటికే కరుణించడంతో ఆట మళ్లీ మొదలైంది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ తో 25 పరుగులు చేసి రాబిన్సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా.... కేఎల్ రాహుల్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ 2, ఓల్లీ రాబిన్సన్ 2 వికెట్లు తీశారు.

More Telugu News