ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

06-08-2021 Fri 17:43
  • ఏపీలో కరోనా సెకండ్ వేవ్
  • పదో తరగతి పరీక్షలు రద్దు
  • అందరినీ పాస్ చేసిన ప్రభుత్వం
  • ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు
Tenth Class results released in AP
ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, అందరినీ పాస్ చేయడం తెలిసిందే. అయితే, విద్యాసంవత్సరంలో నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్ మెంట్ పరీక్షల ఆధారంగా ఫలితాలు రూపొందించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభను పరిశీలించి గ్రేడ్ లు కేటాయించారు. ఈ నేపథ్యంలో, పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విజయవాడలో విడుదల చేశారు. ఫలితాలను bse.ap.gov.in వెబ్ సైట్లో పొందుపరిచారు.