Baireddy Siddarth Reddy: ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి 

 Baireddy Siddarth Reddy taken charge as SAAP new chairman
  • శాప్ కు కొత్త చైర్మన్
  • ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ
  • శాప్ చైర్మన్ గా సిద్ధార్థ్ రెడ్డి నియామకం
  • ఇవాళ విజయవాడలో ప్రమాణస్వీకారం
ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. నూతన శాప్ చైర్మన్ కు నేతలు, క్రీడాప్రముఖులు అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా శాప్ చైర్మన్ పదవిని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి అప్పగించారు.

సిద్ధార్థ్ రెడ్డి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఆయన సేవలను గుర్తించిన సీఎం జగన్ గతంలోనే హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఉన్న పదవిని సిద్ధార్థ్ రెడ్డికి ఇస్తామని 2019 అసెంబ్లీ ఎన్నికల వేళ పేర్కొన్నారు.
Baireddy Siddarth Reddy
Chairman
SAAP
YSRCP
Andhra Pradesh

More Telugu News