PV Sindhu: విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న పీవీ సింధు

sindhu visits indrakeeladri
  • ఆలయంలో ప్రత్యేక పూజలు
  • పీవీ సింధుకు వేదాశీర్వచనం చేసిన పండితులు
  • ఒలింపిక్స్‌కు వెళ్లేముందూ దుర్గమ్మను దర్శించుకున్న సింధు
  • అమ్మవారి ఆశీస్సులతో పోటీల్లో పతకం సాధించాన‌ని వ్యాఖ్య‌
భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి ద‌ర్శించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన‌ అనంతరం పండితులు పీవీ సింధుకు వేదాశీర్వచనం అందించారు.

ఆ త‌ర్వాత పీవీ సింధుకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లేముందు తాను క‌న‌క‌దుర్గమ్మను దర్శించుకున్నానని, అమ్మవారి ఆశీస్సులతో పోటీల్లో నెగ్గి పతకం సాధించాన‌ని చెప్పింది. తాను ప్యారిస్ ఒలింపిక్స్ లోనూ ఆడ‌తాన‌ని తెలిపింది.  
PV Sindhu
olumpics
Vijayawada

More Telugu News